అదేంటి అంతమాట అనేసారు..నితిన్ (Nithin) ను ఎందుకు ఎగ్జిబిటర్లు బెదిరిస్తారు..ఆయన ఏం చేశాడు.. తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు కదా అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే కొంతమంది హీరోలకు, థియేటర్స్ అసోసియేషన్ (Theatres Association)కి అసలు పడడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో హీరో నాని (Nani)ని కొంతమంది ఎగ్జిబిటర్లు దారుణంగా విమర్శించారు. దానికి కారణం ఆయన టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతూ ఉండడమే. ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అనేది నిర్మాత ఇష్టం. అయితే అదే రోజు థియేటర్ లలో లవ్ స్టోరీ సినిమా విడుదలవుతుంది. దానికి వ్యతిరేకంగా ఈ సినిమాను ఓటీటీలో పోటీగా విడుదల చేయడాన్ని తప్పు పట్టారు థియేటర్స్ అసోసియేషన్. దీనిపై తర్వాత మళ్లీ నానికి క్షమాపణ కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో (Maestro) సినిమా ట్రైలర్ విడుదలైంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో రెండు ట్రైలర్లు విడుదల చేశాడు నితిన్. ఈ సినిమా కూడా థియేటర్లలో కాకుండా హాట్ స్టార్ డిస్నీ (Disney+Hotstar)లో విడుదల కానుంది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) తెరకెక్కించిన ఈ సినిమాకు దాదాపు 32 కోట్ల ఆఫర్ హాట్ స్టార్ డిస్నీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మొదట విడుదలైన మాస్ట్రో ట్రైలర్ లో సెప్టెంబర్ 9 ప్రీమియర్స్ అంటూ అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో తెలియదు ఇంకో పది నిమిషాల గ్యాప్ లో మరో ట్రైలర్ విడుదలైంది. అందులో కమింగ్ సూన్ అని మాత్రమే వేశారు. డేట్ మెన్షన్ చేయలేదు.
కేవలం పదే పది నిమిషాల వ్యవధిలో ఎందుకు మనసు మార్చుకున్నారు..విడుదల తేదీని ఎందుకు ప్రకటించలేదు అనేది చాలా మందిని కలవరపెడుతున్న ప్రశ్న. అప్పటికే టక్ జగదీష్, లవ్ స్టోరీ సినిమాలు సెప్టెంబర్ 10న ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. ఒకటి డిజిటల్, మరొకటి థియేటర్స్ లో విడుదల కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ట్రో సినిమా కూడా అదే టైంలో విడుదల చేస్తే పోటీ ఎక్కువైపోయి లవ్ స్టోరీ సినిమాకు కలెక్షన్స్ తగ్గిపోతాయనేది ఎగ్జిబిటర్ల వాదన. బహుశా నితిన్ కూడా తన సినిమా విడుదల తేదీని అందుకే ప్రకటించలేదు అంటున్నారు విశ్లేషకులు.
ఎగ్జిబిటర్ల నుంచి నితిన్ కు హెచ్చరికలు వెళ్లడంతోనే నిర్ణయం మార్చుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మాస్ట్రో సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో నభా నటేష్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల కావడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు థియేటర్స్ అసోసియేషన్. ఇది చాలదన్నట్టు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకు..ఈ సినిమాలు పోటీగా వస్తే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. అందుకే మాస్ట్రో రిలీజ్ డేట్ విషయంలో కాస్త ఆలోచనలో పడిపోయింది చిత్రయూనిట్.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!