శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 20:36:14

మాజీ మంత్రి నాయిని స‌తీమ‌ణి అహల్య క‌న్నుమూత‌

మాజీ మంత్రి నాయిని స‌తీమ‌ణి అహల్య క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌: మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి స‌తీమ‌ణి అహ‌ల్య (64) క‌న్నుమూశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అహ‌ల్య‌ తుదిశ్వాస విడిచారు. కరోనా పాజిటివ్ రావటంతో నాయిని నర్సింహారెడ్డితోపాటు అహల్య అపోలో ఆస్ప‌త్రిలో  చేరారు. కరోనా నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండ‌టంతో చికిత్స పొందుతూ..నేడు తుదిశ్వాస విడిచారు.

ఇటీవ‌లే భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతితో ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు  అంబులెన్స్ లో తీసుకొచ్చారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.