శుక్రవారం 14 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 23:45:49

సుశాంత్‌ ప్రియురాళ్ల మాటల యుద్ధం

సుశాంత్‌ ప్రియురాళ్ల మాటల యుద్ధం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన బలవన్మరణనానికి కారణమేమిటనే చిక్కుముడి మాత్రం ఇంకా వీడలేదు.  కెరీర్‌ పరమైన ఇబ్బందులతో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని మాజీ ప్రేయసి అంకితా లోఖండే స్పష్టం చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్‌లో నెపోటిజంతో (బంధుప్రీతి)  పాటు అనేక సమస్యలున్నాయి. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కోవాల్సివుంటుంది. వాటన్నింటికి సిద్ధమయ్యే సుశాంత్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అవకాశాలు రాకపోవడంతో ఒత్తిడికి గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడనేది అబద్ధం. అతడి మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. సుశాంత్‌ తండ్రి రియా చక్రవర్తిపై చేస్తున్న ఆరోపణలకు ఖచ్చితంగా ఆధారాలు ఉండే ఉంటాయని నమ్ముతున్నా’ అని తెలిపింది.

సత్యమే గెలుస్తుంది

సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని ప్రియురాలు రియా చక్రవర్తిపై సుశాంత్‌ తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి ఓ వీడియోను విడుదలచేసింది. ‘న్యాయవ్యవస్థపై నాకు నమ్మకముంది. సత్యమే గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. న్యాయవాదుల సూచన మేరకు నాపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తాను’  తెలిపింది.

తాజావార్తలు


logo