శనివారం 11 జూలై 2020
Cinema - May 11, 2020 , 01:19:35

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి

  • సినీ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌
మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సినీ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ అన్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం వడ్డేపల్లిలో కాలనీల్లో తరుణ్‌భాస్కర్‌ పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలని తన చిన్నాన్న దాస్యం వినయ్‌భాస్కర్‌ కోరిక మేరకు పేద ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశానన్నారు. అందరికీ ఆరోగ్యకర జీవితం కోసం మంత్రి కేటీఆర్‌ అమలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి హైదరాబాద్‌ నుంచి తాను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, జేసీ దయానంద్‌, కార్పొరేటర్లు దాస్యం విజయభాస్కర్‌, మిడిదొడ్డి స్వప్న తదితరులు పాల్గొన్నారు. 


logo