ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 02:51:58

జీవితంలో కొన్ని తప్పులు చేశా

జీవితంలో కొన్ని తప్పులు చేశా

జీవితమే తనకు అత్యుత్తమమైన గురువని అంటోంది బాలీవుడ్‌ సీనియర్‌ నాయిక రవీనాటాండన్‌.  సుదీర్ఘప్రయాణంలో ప్రతిరోజు ఓ కొత్త పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపింది.  బాలీవుడ్‌లో కథానాయికగా తాను సాగించిన జర్నీ గురించి రవీనాటాండన్‌ తాత్విక ధోరణిలో మాట్లాడింది. ‘తప్పులు మానవ సహజం. నేను కొన్ని పొరపాట్లు చేశాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆ తప్పులు నాకు గొప్ప పాఠాలను  నేర్పాయి. ఎన్నో ఆశలతో చిన్న వయసులోనే  నట జీవితాన్ని ఆరంభించాను. నేను కన్న కలల్లో  చాలా వరకు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. అవి నెరవేరలేదనే అపరాధభావం నాలో లేదు. వాటిని తల్చుకొని ఎప్పుడూ కుమిలిపోలేదు. కష్టాలు ఎదురైనా ప్రతిసారి జీవితాన్ని మరింత గాఢంగా ప్రేమించడం నేర్చుకున్నా. ఓడిపోయిన చోట గౌరవాన్ని పొందడం కోసం అంకితభావంతో కష్టపడ్డా’ అని తెలిపింది. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’లో కీలక పాత్రలో నటిస్తోంది రవీనాటాండన్‌. logo