మీ పాట నాకు స్పెషల్‌..ట్విట‌ర్ లో బాలుపై స‌ల్మాన్

Sep 25, 2020 , 07:00:58

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని ఎంజీఎం ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కోలుకుని ఆరోగ్యంగా, క్షేమంగా ఇంటికి తిరిగిరావాల‌ని అభిమానులు, సినీప్ర‌ముఖులు కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ సోష‌ల్ మీడియాలో త‌న సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకునేలా మ‌రింత శ‌క్తి రావాల‌ని స‌ల్మాన్ ఆకాంక్షించారు. మీరు నా కోసం పాడిన ప్ర‌తీ పాట ప్రత్యేక‌మైన‌ది. అద్బుత‌మైన పాట‌లు పాడినంద‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా. మీ దిల్ దివానా హీరో ప్రేమ్, ల‌వ్ యు స‌ర్..’ అంటూ స‌ల్మాన్ ట్వీట్ చేశాడు.

90ల‌లో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన మై నే ప్యార్ కియా, సాజ‌న్, హ‌మ్ ఆప్కే హై క‌న్, అందాజ అప్నా అప్నా వంటి చిత్రాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన పాట‌లు పాడారు బాలు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD