సోమవారం 01 జూన్ 2020
Cinema - May 22, 2020 , 23:07:29

ఆ రూల్స్‌ హీరోలకేనా?

ఆ రూల్స్‌ హీరోలకేనా?

ఊహజనీతంగా ఎవరో ఒకరు సృష్టించే కట్టు కథల  వల్ల సినీ ప్రయాణంలో అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డానని అంటోంది తమన్నా.  తొలినాళ్ల నుంచి అసత్య వార్తలతో పోరాడుతూనే ఉన్నానని  తెలిపింది. తెలుగులో రవితేజ సరసన ఓ సినిమా కోసం ఆమె రెండున్నర కోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన మార్కెట్‌కు మించి ఆమె రెమ్యునరేషన్‌ కోరడంతో చిత్రబృందం వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై తమన్నా స్పందిస్తూ ‘పారితోషికం అనేది తారల ఇమేజ్‌, ఆర్థిక విలువను అనుసరించి ఉంటుంది.  రెమ్యునరేషన్‌  విషయంలో చిత్రసీమలో నాయకానాయికల మధ్య అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ఇండస్ట్రీలో కథానాయికలు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమిస్తుంటారు. ఓ సినిమా విజయంలో హీరోలతో పాటు హీరోయిన్లు ముఖ్య భూమిక పోషిస్తుంటారు. అయినా పారితోషికం విషయం వచ్చేసరికి హయ్యెస్ట్‌ పెయిడ్‌ స్టార్‌ ట్యాగ్స్‌ మాత్రం హీరోలకే వర్తిస్తుంటాయి. హీరోలకే ఆ అర్హత   ఉంటుంది.  కథానాయికల్ని పరిగణనలోకి తీసుకోరు.  ఈ ఆలోచన ధోరణిలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది’ అని తెలిపింది. సినిమా ఆంగీకరించడం, నిరాకరించడం అంశాలు  హీరోతో ఉన్న అనుబంధాన్ని ప్రభావితం చేయలేవని చెప్పింది.


logo