గురువారం 04 జూన్ 2020
Cinema - May 06, 2020 , 23:09:06

ఆ పాఠం నేర్చుకున్నా

 ఆ పాఠం నేర్చుకున్నా

కరోనా కారణంగా అనుకోకుండా వచ్చిన విరామాన్ని  పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నారు కథానాయికలు. తమ అభిరుచులు, ఆసక్తులతో కాలక్షేపం చేస్తూనే అందాన్ని కాపాడుకోవడంపై దృష్టిసారిస్తున్నారు.  వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోల్ని అభిమానులతో పంచుకుంటూ వారిలో అవగాహన కల్పిస్తున్నారు.  గతంతో పోలిస్తే ప్రస్తుతం యోగా, వర్కవుట్స్‌కు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నానని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌.  క్వారంటైన్‌ టైమ్‌ లైఫ్‌ైస్టెల్‌ గురించి ఆమె మాట్లాడుతూ ‘2018లో నా యోగా ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత నా రోజువారి జీవితంలో యోగ భాగంగా మారింది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా యోగా కోసం ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాను’ అని తెలిపింది.  కరోనా కారణంగా ఎదురైన పరిస్థితుల గురించి వివరిస్తూ ‘మంచి, చెడు ఏదైనా సమంగా స్వీకరించాలి.  కొన్ని సార్లు మనం కోరుకున్నట్లుగా జీవితం సాగదు. పరిస్థితుల్ని ఎదురించలేని నిస్సహాయత ఉంటుంది. అలాంటి సమయంలో ఓపికగా ఎదురుచూడటం ముఖ్యం. అదే ఈ విరామంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం’ అని తెలిపింది  క్వారంటైన్‌ టైమ్‌లో కొత్త వంటకాలతో ప్రయోగాలు చేస్తోంది రకుల్‌. వంటల విషయంలో తన ఆసక్తుల గురించి చెబుతూ ‘పోషకాలతో కూడిన మితమైన భోజనానికి ప్రాధాన్యతనిస్తాను.  ఆహారం విషయంలో సమతుల్యం పాటిస్తాను. అదే ఇమ్యూనిటీని పెంపొందిస్తుందని నమ్ముతాను’ అని చెబుతోంది. 


logo