యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు బుల్లితెర అయిన అటు వెండితెర అయిన రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఎన్టీఆర్ హవా ఎలాంటిదో ఆయన సినిమా రికార్డులే చెబుతాయి. ఇక బుల్లితెర విషయానికి వస్తే బిగ్ బాస్ షో దుమ్ము రేపిన ఎన్టీఆర్ ఇప్పుడు ”ఎవరు మీలో కోటీశ్వరులు” అనే రియాలిటీ గేమ్ షో ద్వారా మరోసారి అలరించడానికి రెడీ అయ్యారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలలోను పాల్గొన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వలన ప్రోగ్రాం వాయిదా పడింది. షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ”ఎవరు మీలో కోటీశ్వరులు” టీవీ షో షూటింగ్ జూలై రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కోసం స్పెషల్ సెట్ ఏర్పాటు చేశారు. అలానే తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కంటెస్టెంట్స్ ని కూడా షార్ట్ లిస్ట్ చేసారని తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే దీనిని టీవీలో ప్రసారం చేస్తారని టాక్