సూర్య కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎతారుక్కుమ్ తున్నిందవన్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. సూర్య 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. నేడు సూర్య జన్మదినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ఖడ్గం చేతబూని శక్తివంతంగా కనిపిస్తున్నారు. సూర్య గెటప్ మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. గ్రామీణ పోరాట కథాంశంతో శక్తివంతమైన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.