‘కొత్తగా మాప్రయాణం’ ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. నాదెండ్ల రాజేష్ దర్శకుడు. అనిల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్.ఎస్.రావు, విష్ణువర్ధన్‌లు నిర్మాతలు.
దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల చిత్రీకరించిన ప్రత్యేకగీతంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి.