శనివారం 06 జూన్ 2020
Cinema - May 16, 2020 , 22:35:56

స్పానిష్‌ ప్రేమాయణం

స్పానిష్‌ ప్రేమాయణం

బాలీవుడ్‌ భామ ఇషాగుప్తాకు ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌గా గుర్తింపు ఉంది. టాప్‌లెస్‌ ఫొటోలతో సందడి చేసే ఈ భామకు యువతరంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఈ సుందరి పెళ్లి వార్తొకటి ముంబయి సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. స్పానిష్‌ వ్యాపారవేత్త మాన్యువల్‌ కాంపస్‌ గ్యూల్లర్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే వెల్లడించింది ఇషాగుప్తా. ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని సమాచారం. కుటుంబ పెద్దలు చర్చించుకున్నాక వివాహం విషయంలో ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు.  బాలీవుడ్‌నాయిక శ్రియ రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చెవ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. మరో నాయిక తాప్సీ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాడు మాతిస్‌బోయేతో ప్రేమలో  ఉంది. ఈ వరుసలోనే ఇషాగుప్తా సైతం విదేశీయుడి ప్రేమలో పడటం విశేషంగా చెబుతున్నారు. 


logo