శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 13:28:32

బిగ్ బాస్ హౌజ్‌లో ఫ‌న్‌.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా అభిజిత్

బిగ్ బాస్ హౌజ్‌లో ఫ‌న్‌.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా అభిజిత్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. కొట్లాట‌లు, ప్రేమ‌లు, గేమ్స్, టాస్క్‌లు ఇలా ఒకటేంటి ఎన్నో అంశాల‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేస్తున్నారు ఇంటి స‌భ్యులు. నేటితో ఈ షో విజ‌య‌వంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ రోజు సండే కావ‌డంతో హౌజ్‌లో అంతా ఫ‌న్ హ‌డావిడి ఉంటుంది. నాగార్జున ఇంటి స‌భ్యుల‌తో ప‌లు టాస్క్‌లు చేయిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంటారు.

తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో మెహ‌బూబ్ రేసుగుర్రం డైలాగ్ చెప్పగా, సోహైల్ పోకిరీ డైలాగ్స్ చెప్ప‌డంతో పాటు మ‌హేష్ స్టైల్‌లో ప‌రుగు తీసారు. దీనికి నాగార్జున.. మ‌హేష్ చెబుతానంటూ పంచ్ వేశారు. ఆ త‌ర్వాత కొంద‌రి ఇంటి స‌భ్యుల ముఖాల‌ని సినిమా పోస్ట‌ర్‌లో హీరోల ముఖాల‌తో మార్ఫింగ్ చేసి ప్ర‌ద‌ర్శించారు. రాజ‌శేఖ‌ర్ ముఖాన్ని మాస్ట‌ర్ చిత్రంలో విజ‌య్ ముఖంతో  మార్ఫింగ్ చేయ‌గా, జ‌ల్సాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖంతో అరియానాని, పెద‌రాయుడు చిత్రంలో మోహ‌న్ బాబు ఫేస్‌ని లాస్య‌తో, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖాన్ని అభిజిత్‌తో, ఏ మాయ చేశావే చిత్రంలో స‌మంత ముఖాన్ని మోనాల్ ఫోటోతో మార్ఫింగ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

అభిజిత్ పోస్ట‌ర్‌పై స్పందించమ‌ని అవినాష్‌ని నాగార్జున అడ‌గ‌గా, అభి ప్లేస్ లో నేను ఉండాల్సింది అని జ‌వాబిచ్చాడు. ఇక అఖిల్ .. ఆ అమ్మాయి నాది అనే డైలాగ్ చెప్ప‌గా, ఇది క‌రెక్ట్ చెప్పావు అని నాగ్ పేర్కొన్నారు. ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి నాగ్ తెగ సంద‌డి చేయ‌గా, ఆ హంగామాని నేటి ఎపిసోడ్‌లో త‌ప్ప‌క‌ వీక్షించండి మ‌రి.