ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi)దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహాసముద్రం (Maha Samudram). శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), అదితీ రావు హైదరి ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. సముద్రం చాలా గొప్పది మామా చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది..అంటూ శర్వానంద్ చెబుతున్న సంభాషణలతో ట్రైలర్ షురూ అయింది. నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన బాగున్నట్టు కాదు అర్జున్..అంటూ నువ్వు సముద్రం లాంటివాడివి అర్జున్ నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయి..శర్వా నంద్ గురించి హీరోయిన్ చెప్తున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..అని శర్వానంద్ చెప్పే డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మీరు చేస్తే నీతి నేను చేస్తే బూతా అంటూ చివరలో సిద్దార్థ్ చెప్పే సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హీరోయిన్ల పాత్రలు బోల్డ్‌గా, అందంగా భిన్నమైన షేడ్స్ లో సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజ్ తోట కెమెరా పనితనం, చేతన్ భరద్వాజ్ బీజీఎం, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
రొమాన్స్, యాక్షన్, వినోదం, ఇతర భావోద్వేగాల కలయికతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో తెలియాలంటే అక్టోబర్ 14 వరకు ఆగాల్సిందే.
– Advertisement –
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!