శుక్రవారం 10 జూలై 2020
Cinema - May 29, 2020 , 23:00:36

జీవితం పరుగు పందెం

జీవితం పరుగు పందెం

లాక్‌డౌన్‌ వల్ల రెండునెలలుగా ఇంట్లో గడిపిన సమయంలో నిజమైన ఆనందం, శాంతి అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందని చెప్పింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌చేసిందీ అమ్మడు. పద్దెనిమిదవ ఏట నుంచే తన జీవితం పరుగుపందెంలా మారిందని, గమ్యం చేరుకున్నానని మురిసిపోయేలోపే..మరో లక్ష్యం కోసం పరుగు ఆరంభించాల్సిన పరిస్థితులొచ్చాయని చెప్పింది. స్కూల్‌ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరకు హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని..ఆ సమయంలో తల్లిదండ్రులు తన పట్ల కఠినంగా ఉంటున్నారనే భావనలో ఉండేదాన్నంది. చిన్నతనం నుంచే తనది ధిక్కార మనస్తత్వమని, జీవితాన్ని అనుకున్న విధంగా తీర్చిదిద్దుకోవడానికి ఆ నైజమే తోడ్పడిందని చెప్పుకొచ్చింది. కెరీర్‌ ఆరంభంలో షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు రాత్రిళ్లు అమ్మ తనతో ఉండేదని, నాన్న కుటుంబం సాగడానికి ఎంతో కష్టపడేవారని గుర్తుచేసుకుంది. కుటుంబం అందించిన స్వేచ్ఛ వల్లే తానీ స్థాయిలో ఉన్నానని చెప్పింది. సుదీర్ఘ పనిదినం తర్వాత ఇంటికి చేరుకుంటే లభించే శాంతి ముందు అన్నీ వ్యర్థమేనని ఉద్వేగంగా స్పందించింది.logo