శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 01:31:16

సరికొత్త ప్రయాణానికి శ్రీకారం

సరికొత్త ప్రయాణానికి  శ్రీకారం

‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో సహజ అభినయంతో ఆకట్టుకున్నది హైదరాబాదీ సోయగం  అదితీరావ్‌ హైదరీ. ఈ అమ్మడు తెలుగులో  మరో చక్కటి అవకాశాన్ని సొంతం చేసుకున్నది. శర్వానంద్‌, సిద్దార్థ్‌ హీరోలుగా నటించనున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌భూపతి దర్శకుడు.  ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అదితీరావ్‌ హైదరీని ఎంపికచేసినట్లు చిత్రబృందం  సోమవారం ప్రకటించింది. ‘నటనకు ఆస్కారమున్న కీలక పాత్ర కోసం పలువురు నాయికల పేర్లను పరిశీలించి చివరకు అదితీని తీసుకున్నాం. ఆమె అయితేనే ఈ ఛాలెంజింగ్‌ పాత్రకు న్యాయం చేయగలదనే నమ్మకముంది’ అని చిత్రబృందం తెలిపింది. ‘ఈ సినిమా ద్వారా నా కెరీర్‌లో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నా’ అని అదితీరావ్‌హైదరీ పేర్కొన్నది.  ప్రేమ, యాక్షన్‌ అంశాలకు నాటకీయతను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.


logo