మెహరిన్ కౌర్ నాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్ కథానాయకుడు. మారుతి దర్శకత్వంలో వి.సెల్యూలాయిడ్ సంస్థతో కలిసి ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎక్కేసిందే’ అనే లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు చక్కని స్పందన వస్తోందని చెబుతోంది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఫాస్ట్ పెప్పిగా వున్న ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తోంది. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ సూపర్‌హిట్‌గా నిలిచింది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించాం’ అన్నారు.