టాలీవుడ్ (Tollywood) లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఒకటి మను చరిత్ర (Manu Charitra). ఈ చిత్రంలో శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా నటిస్తుండగా..మేఘా ఆకాశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా ఏ సోట ఉంటాదిరో..ఏ గల్లిలుంటాదిరో ఆ ఇల్లూ ఏ సందులుంటాదిరో అని హీరోయిన్ గురించి హీరో అండ్ బ్యాచ్ పాడుకుంటున్న పాడుకుంటున్న ఈ పాట క్లాస్, మాస్ టచ్‌తో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. చంద్రబోస్ అద్బుతమైన లిరిక్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించారు. చంద్రబోస్ ఈ పాటలో కనిపించడం విశేషం. మరి సినిమాలో కూడా కనిపిస్తాడా..? లేదా అన్నది చూడాలి.
మనుచరిత్రలో ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీ వాత్సవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతుంది. ఇటీవలే మనుచరిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. భరత్ పెదగాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యాపిల్ ట్రీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రానికి
గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్