అసలే ఇప్పుడు బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు.. బయటికి వెళ్తే కరోనాను వెంట బెట్టుకుని ఇంటికి రావాల్సిందే అనేంత దారుణంగా మారిపోయాయి సిచ్యువేషన్స్. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ చాలా మంది దర్శక నిర్మాతలు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే మాట ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ కూడా చెప్పాడు. ఈయన నటించిన ఏక్ మినీ కథ సినిమా ఎప్రిల్ 30 నుంచి వాయిదా పడింది.
కరోనా కారణంగా వాయిదా వేసారు దర్శక నిర్మాతలు. వర్షం దర్శకుడు శోభన్ కొడుకు ఈయన. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ప్రభాస్ చూసుకుంటున్నాడు. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కొడుక్కి లైఫ్ ఇస్తున్నాడు ప్రభాస్.కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యానర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది.
ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మాయలో.., సామిరంగా లిరికల్ సాంగ్స్ యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు.
కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాను ఎప్రిల్ 30న విడుదల చేస్తామంటూ ఇదివరకే దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.
ఈ క్రమంలోనే హీరో సంతోష్ శోభన్, నటుడు సుదర్శన్ కలిసి ఓ సరదా వీడియో కూడా చేసారు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత కొత్త తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలంటూ కోరారు హీరో సంతోష్ శోభన్.
ఇవి కూడా చదవండి..
ఆచార్య రిలీజ్ పై కొరటాల క్లారిటీ..!
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…