అందాల ముద్దుగుమ్మలు సినిమాల సంగతి పక్కన పెట్టి ఫొటోషూట్స్‌తో నెటిజన్స్‌కి పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఫోటో షూట్స్ చేస్తూ మతులు పోగొడుతున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా తగ్గేదే లే అంటుంది. మొన్నామధ్య పచ్చని మైదానంలో ఫొటో షూట్ చేసి వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక తాజాగా జిమ్‌లో కసరత్తులు చేయడం పూర్తయ్యాక ఫొటో షూట్ చేసింది ఈషా. ఇందులో చెమటలు కారుస్తూనే తన అందచందాలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈషా ఫొటోలకు ఆమె అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తెలుగు భామ ఈషా రెబ్బా..’బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘అరవింద సమేత వీరరాఘవ’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రావడం లేదు.