మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 11:49:53

రియాకు ఈడీ స‌మ‌న్లు.. రేపే విచార‌ణ‌

రియాకు ఈడీ స‌మ‌న్లు.. రేపే విచార‌ణ‌

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ స‌మ‌న్లు జారీ చేసింది. మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద ఆమెకు ఈడీ స‌మ‌న్లు ఇచ్చింది. ఆగ‌స్టు 7వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. సుశాంత్ డ‌బ్బును ప‌ర్స‌న‌ల్‌గా వాడుకున్న‌ట్లు రియాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.   ముంబైలో రెండు ప్రాప‌ర్టీల‌పై రియా పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు ఈడీ గుర్తించింది. సుశాంత్ అకౌంట్ నుంచి ఆ ప్రాప‌ర్టీల‌కు డ‌బ్బు వెళ్లిందా లేదా అన్న కోణంలో ఈడీ ప్ర‌శ్నించ‌నున్నారు. రియాకు చెందిన సీఏకు కూడా స‌మ‌న్లు జారీ చేశారు. హీరో సుశాంత్ సీఏ సందీప్ శ్రీధ‌ర్‌కు కూడా ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. సుశాంత్ ఫైనాన్స్‌, కంపెనీల గురించి ఈడీ ఆరా తీసింది.  రియా త‌న ఫ్యామిలీతో క‌లిసి సుశాంత్‌ను దోచుకున్న‌ట్లు కేకే సింగ్ ఆరోపించారు. 


logo