గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 08:54:39

రియా సోద‌రుడిని 30 గంట‌ల పాటు విచారించిన ఈడీ..!

రియా సోద‌రుడిని 30 గంట‌ల పాటు విచారించిన ఈడీ..!

సుశాంత్ అకౌంట్ నుంచి న‌గ‌దు బదిలీ అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తి, తండ్రి ఇంద్ర‌జిత్ చ‌క్ర‌వ‌ర్తి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికీ రెండు సార్లు రియా ఫ్యామిలీని ఈడీ విచారించ‌గా అందులో రియా సోద‌రుడు  శౌవిక్ ఒక్క‌డినే 30 గంట‌ల పాటు ఈడీ అధికారులు విచారించిన‌ట్టు బాలీవుడ్ మీడియా చెబుతుంది.

సోమ‌వారం రియా కుటుంబ స‌భ్యులు అంద‌రు మ‌రోసారి ఈడీ ఆఫీసుకి చేరుకోగా, అక్క‌డ‌ మ‌నీ లాండ‌రింగ్‌కి సంబంధించి ప‌లు కోణాల‌లో విచారించార‌ట‌.  ఉద‌యం 11గంట‌లకి ఈడీ ఆఫీసుకు చేరుకున్న వారు తిరిగి రాత్రి 9గంట‌ల ప్రాంతంలో బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.  రియా, రాజ్‌పుత్ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీ, సుశాంత్ రూమ్‌మేట్ సిద్ధార్థ్ పిథానిని కూడా విచార‌ణ‌ని ఎదుర్కొన్నారు. శౌవిక్‌పైనే ఈడీ ఎక్కువ‌గా ఫోక‌స్ చేసినట్టు తెలుస్తుంది. 


logo