గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 13:30:35

రెండేళ్ల కూతురికి జ‌డ చిక్కులు తీసిన‌ హీరో

రెండేళ్ల కూతురికి జ‌డ చిక్కులు తీసిన‌ హీరో

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్స‌న్‌.. త‌న రెండేళ్ల కూతురి త‌ల వెంట్రుక‌లకు చిక్కులు తీశాడు.  పిల్ల‌ల‌తో ఇంట్లో గ‌డుపుతున్న ద రాక్ స్టార్ జాన్స‌న్‌.. త‌న కూతురితో గ‌డిపిన క్ష‌ణాల‌కు సంబంధించిన ఓ ఫోటోను ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ ఫోటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.  తండ్రీకూతుళ్ల బంధం బాగుందంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.  డ్వెయిన్ జాన్స‌న్‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. టియానా రెండేళ్ల అమ్మాయి.  కుర్చీలో కూర్చున్న టియానాకు జ‌డ చిక్కులు తీశాడు  రాక్‌. చిక్కులు తీస్తుంటే త‌న కూతురు నొప్పితో హ‌డ‌లిపోయిన‌ట్లు త‌న పోస్టులో జాన్స‌న్ తెలిపాడు.  త‌న‌కు ఉన్న‌ది బ‌ట్ట‌నెత్తే అయినా.. త‌న‌కు త‌ల‌వెంట్రుక‌ల గురించి తెలునంటూ ఓ సెటైర్ కూడా వేశాడు. ఫోటో క్యూట్‌గా ఉందంటూ కొంద‌రు కామెంట్ చేశారు. జాన్సన్ బేబీ ప్రొడ‌క్ట్స్ అంటూ కొంద‌రు సెటైర్ వేశారు. రాక్ చేయ‌లేనిది ఏదీ లేదంటూ మ‌రికొంద‌రు కామెంట్ చేశారు. తండ్రి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డం గొప్ప‌గా ఫీల‌వుతాన‌ని, తాను పొంద‌నివాటిని త‌న పిల్ల‌ల‌కు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో డ్ఎయిన్ జాన్స‌న్ తెలిపాడు.

 


VIDEOS

logo