బుధవారం 03 జూన్ 2020
Cinema - May 18, 2020 , 10:41:24

హీరోగా ఆర్ఆర్ఆర్ నిర్మాత‌ త‌న‌యుడు..!

హీరోగా ఆర్ఆర్ఆర్ నిర్మాత‌ త‌న‌యుడు..!

ఇండ‌స్ట్రీలోకి వార‌సుల హ‌వా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య‌ త‌న‌యుడు క‌ళ్యాణ్ దాస‌రి వెండితెర ఆరంగేట్రం  చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఎప్ప‌టి నుండో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ,  స‌రైన ద‌ర్శ‌కుడు, స్టోరీ సెట్ కాక‌పోవ‌డంతో గ‌త కొంత కాలంగా క‌ల్యాణ్ అరంగేట్రం వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా దాన‌య్య ..ద‌ర్శ‌‌కుడు శ్రీ‌వాస్‌ని త‌న త‌న‌యుడు క‌ల్యాణ్‌ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఎంచుకున్న‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టికే శ్రీవాస్ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయ‌గా, లాక్‌డౌన్ త‌ర్వాత ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ గురించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ట‌. ఇదిలా ఉంటే డీవీవీ దాన‌య్య ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్  కాంబినేష‌న్‌లో  `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా, మిగ‌తా భాగాన్ని లాక్‌డౌన్ త‌ర్వాత తెరకెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.


logo