బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 16:52:01

భూమి పెడ్నేక‌ర్ మూవీ టైటిల్ మారింది..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

భూమి పెడ్నేక‌ర్ మూవీ టైటిల్ మారింది..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

బాలీవుడ్ న‌టి భూమి పెడ్నేక‌ర్ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం దుర్గావ‌తి. అయితే ఈ సినిమా టైటిల్ ను మార్చేశారు మేక‌ర్స్‌. దుర్గామ‌తి ది మైథ్ టైటిల్ ను ఖ‌రారు చేశారు. టైటిల్ తో కూడిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. అద్దంలో సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తూ భ‌య‌పెటిస్తోంది భూమి. పోస్ట‌ర్ షేర్ చేస్తూ దుర్గామ‌తి వ‌చ్చేస్తుంది అంటూ హిందీలో క్యాప్ష‌న్ ఇచ్చింది. దుర్గావ‌తి చిత్రం డిసెంబ‌ర్ 11న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుందని పేర్కొంది. 

అక్టోబ‌ర్ లో డ‌బ్బింగ్ చెప్పిన స‌మ‌యంలో భూమి పెడ్నేక‌ర్ ఓ ఫొటోను షేర్ చేస్తూ..ద‌ర్వాజా లోప‌ల ఎవ‌రున్నారు..బై దుర్గావ‌తి..నీలో ఉన్న మ‌రో కోణాన్ని చూస్తానంటూ పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే. అనుష్క లీడ్ రోల్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌చ్చిన భాగ‌మ‌తి చిత్రాన్ని డైరెక్ట‌ర్ జీ అశోక్ హిందీలో దుర్గామ‌‌తిగా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఒరిజిన‌ల్ వెర్ష‌న్ బాక్సాపీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo