శనివారం 30 మే 2020
Cinema - Apr 29, 2020 , 11:15:02

డీఎస్పీ మ్యూజిక‌ల్ క్లీనింగ్ వీడియో

డీఎస్పీ మ్యూజిక‌ల్ క్లీనింగ్ వీడియో

అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ వంగా మొద‌లు పెట్టిన బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా మంది హీరోలు, ద‌ర్శ‌కులు, సింగ‌ర్స్,నిర్మాత‌లు ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించి త‌మ ఇళ్ళ‌ల్లోని ఆడ‌వారికి ప‌నుల‌లో సాయంగా నిలిచారు. తాజాగా మ్యూజిక్ సెన్సేష‌న్ దేవి శ్రీ ప్రసాద్ బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌ని స్వీక‌రించి వీడియో షేర్ చేశారు.

సుకుమార్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన దేవి త‌న‌దైన స్టైల్‌లో కంప్లీట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఛాలెంజ్‌లో పాల్గొన్న‌వారందరిని వీడియోలో చూపిస్తూ తాను ఇంటిని శుభ్ర‌ప‌రిచాడు.ఇక ఆమ్లేట్ వేసి త‌న త‌ల్లికి తినిపించాడు. ఆమె తిన్న ప్లేట్ కూడా క‌డిగాడు. చివ‌ర‌లో త‌న తండ్రి ఫోటోల‌ని తూడ్చి,చివ‌రికి త‌ల్లికి కాఫీ అందించాడు. ఈ వీడియోని ప్ర‌తి త‌ల్లికి అంకితం చేస్తున్న‌ట్టు పేర్కొన్నాడు.ఇక  ఈ ఛాలెంజ్‌ని  అల్లు అర్జున్‌, కార్తి, య‌శ్‌, హ‌రీష్ శంక‌ర్ ల‌తో పాటు మోహ‌న్‌లాల్‌ని స్వీక‌రించ‌మ‌ని అడిగారు దేవి.


logo