గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 16:35:15

శ్రియాకు డీఎస్పీ బ‌ర్త్ డే విషెస్‌..సెల్ఫీ వైర‌ల్‌

శ్రియాకు  డీఎస్పీ బ‌ర్త్ డే విషెస్‌..సెల్ఫీ వైర‌ల్‌

ఇష్టం సినిమాతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రియా శ‌ర‌ణ్‌. ఆ త‌ర్వాత టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితో న‌టింటి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగింది. ఇవాళ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నశ్రియాకు కోస్టార్లు, స్నేహితులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అంద‌మైన‌, డ్యాన్సింగ్ గాళ్ కు మ్యూజిక‌ల్ బ‌ర్త్ డే విషెస్‌..ఎప్పుడూ న‌వ్వుతూ..డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ట్వీట్ చేశాడు. శ్రియాతో క‌లిసి దిగిన సెల్ఫీని ట్విటర్ లో పోస్ట్ చేశాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్‌, శ్రియా సెల్ఫీ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

రియ‌ల్ లైఫ్ డ్రామాగా సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న 'గ‌మ‌నం' చిత్రంలో శ్రియ లీడ్ రోల్ లో న‌టిస్తోంది. శ్రియా శ‌ర‌ణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'గ‌మ‌నం' ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ విడుద‌ల చేశారు.  తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo