గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 01:56:35

ఆత్మ ప్రతీకారం

ఆత్మ ప్రతీకారం

నట్టి కరుణ, రాజీవ్‌, సుపర్ణ మలాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డీఎస్‌జే’(దయ్యంతో సహజీవనం). నట్టి కుమార్‌ దర్శకుడు. అనురాగ్‌ కంచర్ల, నట్టి క్రాంతి నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్‌ గౌతంరాజు క్లాప్‌నివ్వగా నట్టి లక్ష్మి కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు నట్టికుమార్‌ మాట్లాడుతూ ‘వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. తనకు జరిగిన అన్యాయంపై ఓ ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఆసక్తిని పంచుతుంది. ఈ సినిమా ద్వారా  నా కూతురు నట్టి కరుణను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నా.  సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్‌, మంగుళూరులో షూటింగ్‌ను జరుపనున్నాం’ అని తెలిపారు. నాన్న నట్టికుమార్‌ దర్శకత్వంలో నటిస్తుండటం ఆనందంగా ఉందని నట్టి కరుణ తెలిపింది. ఆర్జే హేమంత్‌, స్నిగ్ధ, బాబుమోహన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎ.ఖుద్దూస్‌, సినిమాటోగ్రఫీ: కోటి. logo