మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 14:05:40

పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ అయిన 'దృశ్యం 2'

పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ అయిన 'దృశ్యం 2'

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో  రూపొందిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. కుటుంబ విలువలు, మర్డర్‌ మిస్టరీ అంశాల కలబోతగా ఉత్కంఠభరితంగా దర్శకుడు జీతూజోసఫ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.  ఇందులో మధ్యతరగతి తండ్రిగా మోహన్‌లాల్‌ అభినయానికి  ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. తెలుగులో మోహ‌న్‌లాల్ పాత్ర‌లో వెంక‌టేశ్ న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.  చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.

దృశ్యం సీక్వెల్‌కు 'దృశ్యం-2' రాబోతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దీనికి 'జీతూ జోసఫ్'‌‌ దర్శకత్వం వహించనున్నారు. ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించనున్నారు. అయితే 'దృశ్యం-2' సినిమా షూటింగ్ ఆగ‌స్ట్ 17న ప్రారంభం కావాల్సింది. ఇత‌ర కార‌ణాల‌వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈరోజు పూజా కార్య‌క్ర‌మాలు ముగించుకొని షూటింగ్ కూడా ప్రారంభించారు. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ఎప్పుడెప్పుడు రీలీజ్ చేస్తారా అని మోహ‌న్‌లాల్ అభిమానులంతా వేయికండ్ల‌తో ఎదురుచూస్తున్నారు. logo