శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 10:21:43

శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..!

శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..!

బాలీవుడ్ నటుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచార‌ణ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రియా చాటింగ్‌లో డ్ర‌గ్స్ గురించిన వివ‌రాలు ఉండ‌డంతో ఎన్సీబీ రంగ ప్ర‌వేశం చేసింది. అయితే బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్ర‌గ్స్ వాడ‌తార‌ని కంగనా కామెంట్ చేయ‌గా, టాలీవుడ్‌లోను డ్ర‌గ్స్ చాలా మంది తీసుకుంటారని మాధ‌వీల‌త సెన్సేష‌న‌ల్ కామెంట్ చేసింది. దీంతో ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ మాఫియా విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే శాండ‌ల్‌వుడ్ లోను గుట్టు చ‌ప్పుడు కాకుండా డ్ర‌గ్స్ దందా న‌డుస్తున్న‌ట్టు తేలింది. డ్రగ్స్‌ డీలర్‌ అనికా  శాండల్‌వుడ్‌కు చెందిన నటులు, సంగీత కళాకారులు డ్ర‌గ్స్ వాడ‌తార‌ని ఎన్‌సిబీ అధికారుల‌కి చెప్పుకొచ్చింది. కోడ్ పేర్ల‌తో తాను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టు పేర్కొన‌గా, 30 మంది సినిమా క‌ళ‌కారులు డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్టు తెలియ‌జేసింది.  ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్‌సీబీ అధికారులు వారికి నోటీసులను అందించాలని నిర్ణయించారు.  అయితే దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఇచ్చిన సమాచారం ప్ర‌కారం 15 మందికి నోటీసులు పంపిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ విష‌యం క‌న్న‌డ‌నాట హాట్ టాపిక్‌గా మారింది.


logo