మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 17:59:29

ఆస్పత్రిలో రచ్చ..రచ్చ చేసిన హీరోయిన్ సంజన

ఆస్పత్రిలో రచ్చ..రచ్చ చేసిన హీరోయిన్ సంజన

బెంగళూరు : డ్రగ్స్ మాఫియా కేసు లో పోలీసులు  కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. వీరిలో నటి సంజన కూడా ఉంది. బెంగుళూర్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు… తాజాగా కేసు విచారణలో భాగంగా సంజనాకు రక్త పరీక్షలు చేయడానికి ప్రయత్ని స్తుండగా ఆమె నిరాకరించింది. ఆసుపత్రిలో  రక్త నమూనా ఇవ్వడానికి సంజనరచ్చ...రచ్చ.... చేసింది. ఆమె చేసిన లొల్లికి పోలేసులు హడలి పోయారు.


" తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని, ప్రజలు, మీడియా ముందు నన్ను బకరాను చేసి ఆడుకుంటున్నారంటూ " ఆమె ఆరోపించింది. నేను రక్తపరీక్షలు చేయించుకోను, రక్త పరీక్షలు చేసినా అది నా రక్తమే అనడానికి గ్యారెంటీ ఏమిటి ? నాకు ఎవ్వరిమీద నమ్మకం లేదు" అంటూ సంజన తన గోడువెళ్లబోసుకున్నది. నటి రాగిణి, సంజనా డ్రగ్స్ తీసుకున్నట్లు  అంగీకరించారని ఇటీవల పోలీసులు పేర్కొన్నారు. నటి సంజనకు రక్తపరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. ఆ సమయంలో రక్తపరీక్షలు చేయించుకోడానికి సంజనా మొండికేసి, నానా యాగీ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo