గురువారం 28 మే 2020
Cinema - May 22, 2020 , 10:08:58

క‌రోనా ఎఫెక్ట్‌: ప‌ండ్ల వ్యాపారిగా మారిన న‌టుడు

క‌రోనా ఎఫెక్ట్‌: ప‌ండ్ల వ్యాపారిగా మారిన న‌టుడు

క‌రోనాని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల‌న అనేక రంగాలు కుదేల‌య్యాయి. ఇందులో సినీ ప‌రిశ్ర‌మ కూడా ఒక‌టి. లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ కావ‌డంతో రోజువారి వేత‌నం పొందే కార్మికులకి ఉపాధి కరువైంది. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు న‌టులు కూడా దిక్కు తోచ‌ని పరిస్థితుల‌లో ఉన్నారు. 

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్ర‌ధాన పాత్రలో తెర‌కెక్కిన డ్రీమ్ గార్ల్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన న‌టుడు సోలంకి దివాక‌ర్‌. ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు ఆయ‌న పండ్లు, కూర‌గాయ‌లు అమ్ముకునేవారు. ఇప్పుడు లాక్ డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ కావ‌డంతో తిరిగి పాత వృత్తినే కొన‌సాగిస్తున్నాడు. గ‌త రెండు నెల‌లుగా ఆయ‌న పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి అండ‌గా నిలుస్తున్న‌ట్టు తెలుస్తుంది. హ‌ల్క‌, హ‌వా, టిట్లీ, క‌డ్వి హ‌వా, సోంచారియా త‌దిత‌ర చిత్రాల‌లో సోలంకి న‌టించారు.  


logo