శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 15:50:44

నిల‌క‌డ‌గా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం.. జీవిత‌కు నెగెటివ్

నిల‌క‌డ‌గా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం.. జీవిత‌కు నెగెటివ్

కొద్ది రోజుల క్రితం క‌రోనాతో సిటీ న్యూరో సెంట‌ర్‌లో చేరిన రాజ‌శేఖ‌ర్ దంప‌తులకి సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది. ఇందులో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, చికిత్స‌కు కోలుకుంటున్నార‌ని తెలిపారు.  ఇక జీవిత రాజ‌శేఖ‌ర్‌కు తాజాగా జ‌రిపిన పరీక్ష‌లో నెగెటివ్ అని తేల‌డంతో ఈ రోజు డిశ్చార్జ్  చేశామ‌ని పేర్కొన్నారు. 

రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ అంతా క‌రోనా బారిన ప‌డ‌గా, ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్లు శివానీ,శివాత్మిక త్వ‌ర‌గానే కోలుకున్నారు. శివాత్మిక రెండు రోజుల క్రితం త‌న తండ్రి క‌ష్టంగా క‌రోనాతో పోరాడుతున్న‌ట్టు పేర్కొంది. అభిమానులు, ప్ర‌ముఖుల రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.