శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 16:24:58

నా పాత్ర చేస్తుంది ఇత‌డే: ట‌్విట‌ర్ లో వ‌ర్మ‌

నా పాత్ర చేస్తుంది ఇత‌డే: ట‌్విట‌ర్ లో వ‌ర్మ‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ పై మూడు సినిమాలు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. డెబ్యూట్ డైరెక్ట‌ర్ దొర‌సాయి తేజ ఈ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఫ‌స్ట్ పార్టులో ఆర్జీవీ 20 ఏండ్ల వ‌య‌స్సులో కాలేజీ రోజుల నేప‌థ్యాన్ని చూపించ‌నున్నారు. ఈ పాత్ర‌ను డైరెక్ట‌ర్ దొర‌సాయి తేజ‌నే పోషిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. నా బ‌యోజిక్ రాము తొలి పార్టులో దొర‌సాయి తేజ నా పాత్ర చేస్తున్నాడు. దీనికోసం అత‌డు మా అమ్మ ఆశీస్సులు తీసుకుంటున్నాడ‌ని వ‌ర్మ ఫొటోను షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటో ఇపుడు ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

ఆర్జీవీ జీవితంలోని ప‌లు కోణాలను ఆవిష్క‌రిస్తూ మూడు సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. ఆర్జీవీ లైఫ్ లోని వివిధ ద‌శ‌ల‌ను వివ‌రిస్తూ ప్ర‌తీ సినిమా సుమారు 2 గంట‌ల నిడివితో ఉంటుంద‌ట‌. సెప్టెంబ‌ర్ లో షూటింగ్ షురూ కానుంది. ఆస్తిక‌ర విష‌మేంటంటే పార్టు 3లో త‌న పాత్ర‌లో రాంగోపాల్ వ‌ర్మ‌నే క‌నిపిస్తాడ‌ట‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo