e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News Dookudu: ప‌దేళ్ల దూకుడు.. మ‌హేష్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన శ్రీను వైట్ల చిత్రం

Dookudu: ప‌దేళ్ల దూకుడు.. మ‌హేష్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన శ్రీను వైట్ల చిత్రం

ప్ర‌స్తుతం టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌గా దూసుకుపోతున్న మ‌హేష్ కెరీర్‌లోని బెస్ట్ చిత్రాల‌లో దూకుడు ఒక‌టి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ తో పాటు బ్రహ్మానందంప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

35 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌, 101 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘పోకిరి’ తరువాత మహేశ్ నటించిన సైనికుడు,అతిథి, ఖ‌లేజా చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి. ఆ స‌మ‌యంలో ‘దూకుడు’ చిత్రం విడుద‌లై బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకు పోయింది.ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది.

- Advertisement -

తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్ర‌త్యేక‌ స్థానం సంపాదించుకున్న‌ “దూకుడు” చిత్రం విడుద‌లై నేటితో ప‌దేళ్లు అయింది. సందర్భంగా మరోసారి ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో “దూకుడు” రిలీజ్ చేశారు మ‌హేష్ ఫ్యాన్స్. మ‌ళ్లీ ఆ సంద‌డిని వెండితెర‌పై చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ తో కలసి శ్రీను వైట్ల రచన చేశారు. ఇందులోని కామెడీ సీన్స్ జనాన్ని భలేగా కట్టి పడేశాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement