ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 00:03:22

వ్యాపారకోణంలో చూడను: అనుష్క

వ్యాపారకోణంలో చూడను: అనుష్క

సినిమాను వ్యాపారధృక్కోణంతో తాను ఎన్నడూ చూడనని అంటోంది అనుష్క. ఆన్‌స్క్రీన్‌ మ్యాజిక్‌ను, సంతోషాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడానికే ప్రయత్నిస్తానని అంటోంది.  ‘సూపర్‌'సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన అనుష్క చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ప్లాన్‌ చేస్తూ తానెప్పుడూ సినిమాలు చేయలేదని తెలిపింది. మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగానని తెలిపింది. అనుష్క మాట్లాడుతూ ‘వ్యాపార కోణంలో ఆలోచించి ఇప్పటివరకు సినిమాల్ని అంగీకరించలేదు. ఆ లెక్కలు నాకు తెలియవు. నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది? పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను. నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను. అంతకుమించి ఏదీ కోరుకోను. ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండా సినిమాల్లో నటిస్తుంటా.  ఆ ఆలోచనా విధానమే  నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. డబ్బు, స్టార్‌డమ్‌ ఇవ్వలేని సంతృప్తి, ఆనందాన్ని  ఈ సక్సెస్‌లతో పొందగలిగా’ అని తెలిపింది.