శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 21:14:06

భాష తెలియ‌కుండా ప్రేక్ష‌కుల‌ను మోసం చేయొద్దు

భాష తెలియ‌కుండా ప్రేక్ష‌కుల‌ను మోసం చేయొద్దు

స‌ఖి, చెలి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించాడు కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వన్. ఈ యాక్ట‌ర్ తాజాగా నిశ్శ‌బ్ధం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. మీరు స‌ఖి, చెలి త‌ర్వాత తెలుగులో సినిమాలు చేయ‌క‌పోవడానికి గ‌ల కార‌ణ‌మేంట‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మాధ‌వ‌న్ ను అడిగారు. దీనికి మాధ‌వ‌న్ స‌మాధాన‌మిస్తూ..భాష తెలియ‌క‌పోవ‌డం వ‌ల్లే తాను తెలుగులో సినిమా చేయ‌లేక‌పోయిన‌ట్టు చెప్పాడు. సినిమాకు డైలాగ్ డెలివ‌రీ చాలా ముఖ్యం. నాకేమో తెలుగు తెలియ‌దు. మార్కెట్ ఉంది క‌దా అని, భాష తెలియ‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మోసం చేయ‌కూడ‌ద‌నే, హిందీ, త‌మిళంలోనే సినిమాలు చేశా.

స‌వ్య‌సాచి సినిమాలో నా పాత్ర‌కు నేను డ‌బ్బింగ్ చెప్పాల‌నుకున్నా. కానీ చెప్ప‌లేక‌పోయా. కానీ నేను న‌టించే త‌ర్వాతి చిత్రంలో ఖ‌చ్చితంగా డ‌బ్బింగ్ చెప్తా. నాకు ద‌క్షిణాదిన మంచి గుర్తింపు ఉంది. ఇక నుంచి ఎన్ని భాష‌ల్లో సినిమా చేయ‌గ‌లిగితే అన్ని భాష‌ల్లో చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు మాధ‌వ‌న్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo