'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌పై నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పడంతో పాటు మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు తొలగించినప్పటికి తాండవ్‌కు నిరసనల సెగ ఆగడం లేదు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) పాట్నాలో గాడిదలతో నిరసన చేపట్టారు. తాండవ్ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, ప్రధాన పాత్ర దారుడు సైఫ్ అలీఖాన్ ఫొటోలను గాడిద మెడలో వేసి దానిపై దేశ ద్రోహి, హిందూ విరోధి అని రాసి ఊరేగించారు. తాండవ్ వెబ్ సిరీస్ సమాజంలో విభజన సృష్టిస్తుందని వారు పేర్కొన్నారు.
తాండవ్ వెబ్ సిరీస్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది. ఇవి ఆమోదయోగ్యమైనవి కావు అంటూ రాహుల్ అనే నిరసనకారుడు స్పష్టం చేశారు. ఇప్పటికే తాండవ్‌పై పలు రాజకీయ, సామాజిక కార్యకర్తలు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, రీసెంట్గా ముంబై పోలీసులు కూడా తాండవ్ చిత్ర బృందంతో పాటు అమెజాన్‌పై కేసు నమోదు చేశారు. ఇక గురువారం రోజు ఉత్తర బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో తాండవ్‌కు వ్యతిరేఖంగా 100 మంది అఖిల్ భారతీయ విద్యా పరిషత్ సభ్యులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్‌లో డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ సినిమాను తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
తాజావార్తలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
- డ్రాగన్‌తో వాణిజ్యం కొనసాగించాల్సిందే: రాజీవ్ బజాజ్ కుండబద్ధలు