గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 08, 2020 , 22:45:15

సినీ కార్మికుల కోసం

సినీ కార్మికుల కోసం

కరోనా విపత్తు కారణంగా ఉపాధిని కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్యర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ మనకోసంకు సినీ ప్రముఖులంతా విరాళాల్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సీసీసీకి అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పది లక్షల్ని వితరణగా అందజేసింది. నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలి. ప్రభుత్వాలు, వైద్యులు, పోలీసుల సూచనల్ని పాటిస్తూ కరోనా వైరస్‌ నిరోధంలో భాగస్వాములు కావాలి’ అని పేర్కొన్నారు. 

సాయికుమార్‌ వితరణ

హీరో సాయికుమార్‌ తనయుడు ఆదితో కలిసి సీసీసీకి ఐదు లక్షల నాలుగు రూపాయల్ని విరాళంగా అందించారు.  అందరూ ఇళ్లల్లోనే క్షేమంగా ఉండాలని   సాయికుమార్‌ పేర్కొన్నారు. డబ్బింగ్‌ యూనియన్‌ అసోసియేషన్‌కు సాయికుమార్‌  లక్ష ఎనిమిది రూపాయల్ని, ఆయన సోదరుడు  రవిశంకర్‌ లక్ష రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. 

సాగర్‌ ఐదు లక్షల విరాళం 

నటుడు సాగర్‌ (‘మొగలి రేకులు’ఫేం) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల్ని విరాళంగా అందించారు. బుధవారం  కేటీఆర్‌కు సాగర్‌ చెక్‌ను అందజేశారు. 


అమీర్‌ఖాన్‌ విరాళం

బాలీవుడ్‌ అగ్ర నటుడు అమీర్‌ఖాన్‌ పీఏం కేర్స్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాన్ని  అందించారు. ‘లాల్‌సింగ్‌చద్ధా’ సినిమా కోసం పనిచేస్తున్న కార్మికులకు  ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు ప్రకటించారు. ఎంత మొత్తం విరాళంగా అందించింది మాత్రం అమీర్‌ఖాన్‌ తెలుపలేదు.  గృహవసతి, పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదల్ని ఆదుకోబోతున్నట్లు బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ తెలిపారు. logo