గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 23, 2020 , 07:09:19

బాహుబలిగా ట్రంప్‌.. వీడియో షేర్ చేసిన యూఎస్ ప్రెసిడెంట్

బాహుబలిగా ట్రంప్‌.. వీడియో షేర్ చేసిన  యూఎస్ ప్రెసిడెంట్

మ‌రి కొద్ది గంట‌ల‌లో ట్రంప్ త‌న ఫ్యామిలీతో క‌లిసి ఇండియా గ‌డ్డ‌పై అడుగుపెట్ట‌నున్న విష‌యం తెలిసిందే. అయితే  ఇండియా రాక కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా చెబుతూ వ‌స్తున్నారు ట్రంప్‌. సోష‌ల్ మీడియాలోను త‌న‌దైన శైలిలో ట్వీట్స్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు. తాజాగా ఓ నెటిజ‌న్ ట్రంప్ ఇండియాని సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో బాహుబ‌లి లోని జియో రో బాహుబ‌లి సాంగ్‌తో వీడియో ఎడిట్ చేశాడు. ఇందులో ప్ర‌భాస్ ఫేస్‌కి ట్రంప్ ఫేస్ జ‌త చేశాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో ట్రంప్ భార్య‌, కూతురు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోటోలు కూడా జ‌త‌చేశాడు. ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకోగా, ట్రంప్ కూడా ఈ వీడియోపై స్పందించాడు. భారతదేశంలో ఉన్న  నా గొప్ప స్నేహితులని క‌లుసుకునేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. logo