గురువారం 01 అక్టోబర్ 2020
Cinema - Aug 12, 2020 , 20:55:07

‘ఆ పుకార్లు నమ్మొద్దు’.. : మాన్యతా దత్‌

‘ఆ పుకార్లు నమ్మొద్దు’.. : మాన్యతా దత్‌

ముంబై : బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌ తాను సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని, చికిత్స కోసం వెళ్తున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. దీంతో ఆయన లంగ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఆయన కోలుకువాలని అభిమానులతో పాటు ప్రముఖులు సైతం ట్వీట్లు చేశారు.  ఈ ఊహాగాహానాల మధ్య ఆయన భార్య మాన్యతా దత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ తోడు కోవాలి. గతంలో ఎన్నో సంఘటన నుంచి మా కుటుంబం బయటపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తామని నమ్మకం ఉంది. సంజూ పోరాట యోధుడు. మా కుటుంబం కూడా అలానే ఉంది. సంజయ్‌దత్‌ అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కటే.. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. ముందుకు వచ్చే సవాళ్లను అధిగమించేందుకు దేవుడు మనల్ని పరీక్షించేందుకు మరోసారి ఎంచుకున్నాడు. మేం కోరుకునేది మీ ప్రేమ, ఆశీర్వాదాలు. మరోసారి విజేతలుగా బయటపడుతామని తాముకు తెలుసు’ అంటూ మాన్యత లేఖలో పేర్కొన్నారు. 

61 ఏళ్ల సంజయ్‌దత్‌ శ్వాసకోశ, ఛాతిలో ఇబ్బందితో ఈ నెల 8న ముంబైలోని లీలావతి దవాఖానలో చేరారు. రెండు రోజుల తర్వాత మంగళవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినా నెగెటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో ఆయన స్టేజ్‌-3 లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మున్నాభాయ్‌ మంగళవారం ట్విట్టర్‌లో చేసిన పోస్టు సైతం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌. నేను వైద్య చికిత్సల కోసం పని నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు నాతో ఉన్నారు. ఆరోగ్యం గురించి ఊహాగాలు చేయొద్దని నా శ్రేయోభిలాషులను కోరుతున్నాను. మీ ప్రేమ, శుభాకాంక్షలతో నేను త్వరలోనే తిరిగి వస్తాను’ అని ట్వీట్‌ చేశాడు.

దత్‌ బాలీవుడ్‌ స్టార్స్‌ నర్గీస్‌, సునీల్‌ దత్‌ల సంతానం. ఆయనకు ఇద్దరు చెల్లెల్లు ప్రియాదత్‌, నమ్రతా దత్‌ ఉన్నారు. ఆయనకు కొడుకు, కూతురు ఉండగా మాన్యతా దత్‌ను వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు రిచాశర్మతో వివాహం కాగా, వారికి కుమార్తె త్రిషలా దత్‌ ఉంది. రిచా బ్రెయిన్‌ ట్యూమర్‌తో 1996లో మరణించారు. ప్రస్తుతం సంజయ్‌ దత్‌ నటించిన సినిమాలు సడక్ 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆన్ డిస్నీ హాట్ స్టార్ విడుదల విడుదల కానుండగా. సడక్‌-2 ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ఇక కేజీఎఫ్-2, అధీరలో నటిస్తున్నాడు.


logo