సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 22:06:23

ఫ్యామిలీలో సమంత, నాగ చైతన్య ప్రేమకు హెల్ప్ చేసింది ఎవరో తెలుసా..?

ఫ్యామిలీలో సమంత, నాగ చైతన్య ప్రేమకు హెల్ప్ చేసింది ఎవరో తెలుసా..?

హైదరాబాద్‌ : తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. వెండితెరపై అంటే హీరో హీరోయిన్లను చివరికి దర్శకుడు కలిపేస్తాడు. ఎన్ని ట్విస్టులు ఇచ్చినా చివరికి మాత్రం ఇద్దరూ ఒక్కటవుతారు. అది సినిమా కథ అంతే. కానీ రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ప్రేమకథలు చాలానే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ, విజయ నిర్మల నుంచి మొదలుకొని ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రేమకథలు ఉన్నాయి. నాగార్జున, అమల సహా ఎంతోమంది తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. ఈ తరంలో సమంత, నాగ చైతన్య ప్రేమకథకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వచ్చింది. అయితే సమంత, చైతూ ప్రేమకథలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. 

వీళ్లు ప్రేమించుకున్నాం అని చెప్పగానే కుటుంబ సభ్యులు ఈజీగా ఏం ఒప్పుకోలేదు. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే నాగ చైతన్యను పెళ్లాడాలంటే రెండు కుటుంబాలను ఒప్పించాలి. అక్కినేని కుటుంబంతోపాటు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా ఒప్పిస్తే కానీ అక్కినేని కోడలు కాలేదు. సమంత అన్నంత పనిచేసి అందర్నీ ఒప్పించి తన ప్రేమను గెలిపించుకుంది. అయితే సమంత ప్రేమ గెలవడానికి ఒకరి హస్తం మాత్రం చాలానే ఉంది. ఆయనెవరో కాదు రానా దగ్గుబాటి. చైతూకు చిన్నప్పటి నుంచి మంచి దోస్త్ రానా. ఇద్దరూ బావా బామ్మర్దులు అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరే ఉంటారు. 

ప్రతీ విషయంలో చైతూకు వెన్నంటే ఉంటాడు రానా. చివరికి పెళ్లి విషయంలో కూడా రానానే ఉన్నాడు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం ఇంట్లో చెప్పి ఒప్పించడంలో రానా చాలా కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయం సమంత కూడా చెప్పింది. ఈ మధ్యే ఓ షోకు వచ్చిన రానాకు సభాముఖంగా అందరి ముందు థ్యాంక్స్ చెప్పింది. తాను అక్కినేని కుటుంబంలోకి వచ్చానంటే కారణం నువ్వే రానా అంటూ థ్యాంక్స్ చెప్పుకుంది. ఏదేమైనా కూడా చైస్యామ్ లవ్ స్టోరీ సక్సెస్ వెనకాల రానా దగ్గుబాటి హస్తం అలా ఉందన్నమాట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.