హీరోలు ఆన్స్క్రీన్పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోను ప్రాణాలు కాపాడుతుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులని పరామర్శించడం, లేదంటే వారితో వీడియో కాల్లో మాట్లాడడం చేస్తూ ఉత్తేజం నింపుతుంటారు. ఇంకొందరు అభిమానులు అయితే చికిత్స చేయించుకునే సందర్భంలో హీరోల సినిమాలు చూస్తూ ధైర్యంగా ఉంటారు. ఇలా పరోక్షంగా అభిమానులకి అండదండగా ఉంటున్నారు మన హీరోలు.
తాజాగా ఓ పదేళ్ల బాలుడు తమ అభిమాన హీరో విజయ్ సినిమా చూస్తూ ఆపరేషన్ చేయించుకోవడం వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే చెన్నైలోని మైలాపూర్కు చెందిన శశి అనే పదేళ్ల బాలుడు తన మేనమామతో బైక్పై వెళుతూ కిందపడ్డాడు. దీంతో ఆ బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో రాయ్పేటలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. సర్జరీ చేసేందుకు మత్తుమందు ఇచ్చేందుకు వైద్యులు ప్రయత్నించగా, బాలుడు మారం చేశాడు. దీంతో అతని అభిమాన హీరో విజయ్ అని తెలుసుకొని అతను నటించిన తాజా చిత్రం బిగిల్ ప్రదర్శించారు. ఈ సినిమాలో బాలుడు పూర్తిగా నిమగ్నం కావడంతో వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేయగలిగారు.