e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News కండలు తిరిగిన ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

కండలు తిరిగిన ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

కండలు తిరిగిన ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

ఈ ఫొటో చూశారా ! ఫొటోలో ఉన్న కుర్రాడిని ఎక్కడో చూసినట్లుందే..? బాగా తెలిసిన కుర్రాడిలాగే ఉన్నాడు. ఎవరబ్బా.. కచ్చితంగా ఎక్కడో చూసిన మొహంలాగానే ఉందే అనుకుంటున్నారా..? అవును చూసిన మొహమే.. ఇత‌నికి తెలుగు ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు ఉంది. అరడజన్ సినిమాలు కూడా చేశాడు ఈ కుర్రాడు. ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా ఎవరా కుర్రాడు అని..? గుర్తుకు రాకపోతే ఒక్కసారి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాను గుర్తు చేసుకోండి. అందులో నలుగురు కుర్రాళ్లలో శ్రావ్స్ అంటూ ఓ బక్క కుర్రాడు ఉంటాడు కదా..?

కండలు తిరిగిన ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

సీనియర్స్ ముద్దుగా టైసన్ అని ముద్దు పేరు పెడతారు. ఆ కుర్రాడే ఈ కండల వీరుడు. అప్పుడు కామెడీగానే పెట్టినా ఇప్పుడు నిజంగానే టైసన్ అయిపోయాడు. అమ్మో ఇలా అయిపోయాడేంటి అని షాక్ అవుతున్నారా..? 2007లో హ్యాపీ డేస్ సినిమా విడుదలైంది. అప్పుడు మనోడి వయసు 21. అందులో చాలా బక్కగా ఉన్నాడు. డిగ్రీ పట్టా చేత పట్టుకుని వచ్చి శేఖర్ కమ్ముల సినిమాలో నటించాడు. సినిమా ట్రెండ్ సెట్టర్ అయినా కూడా అందులో నటించిన వాళ్లలో నిఖిల్ తప్ప ఎవరూ సక్సెస్ కాలేదు. తమన్నా అప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

వరుణ్ సందేశ్ ఒకట్రెండు సినిమాలతోనే సర్దేశాడు. టైసన్‌గా నటించిన రాహుల్.. స్నేహితులను మోసం చేసే వంశీ అయితే ఎక్కడున్నారో కూడా తెలియదు. అడపాదడపా సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులకు మాత్రం హ్యాపీ డేస్ టైసన్‌గానే గుర్తున్నాడు రాహుల్. మధ్యలో రెయిన్ బో, వెంకటాపురం లాంటి సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఎవరూ గుర్తు కూడా పట్టనంతగా మారిపోయాడు ఈయన. తాజాగా విడుదలైన రాహుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

జాతిరత్నం హీరోయిన్ గ్లామ‌ర్ పిక్స్‌.. వైర‌ల్‌

రాధేతో నిరాశ‌ప‌ర‌చిన ప్ర‌భుదేవా..డైరెక్ష‌న్‌కు బైబై చెప్పాలంటూ సూచ‌న‌!

విష్ణు ప్రియ గ్లామ‌ర్ షో.. యువత ఫిదా

మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్

న‌టి సోద‌రుడు, ప్ర‌ముఖ ఎడిట‌ర్ క‌న్నుమూత‌

కెరీర్ కోసం ప్రేయ‌సికి దూరంగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌

రెండ‌వ డోసు కోవిడ్ టీకా తీసుకున్న స‌ల్మాన్ ఖాన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కండలు తిరిగిన ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

ట్రెండింగ్‌

Advertisement