శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 21:13:24

రవితేజ తొలి పారితోషికం ఎంతో తెలుసా..?

రవితేజ తొలి పారితోషికం ఎంతో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వాళ్ల జాబితాలో గత 40 ఏళ్లలో ముందు చిరంజీవి వస్తాడు.. ఆ తర్వాత రవితేజ వస్తాడు. ఈ ఇద్దరితో పాటు శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు కూడా స్టార్స్ అయ్యారు. కానీ టాలీవుడ్ పై మరీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన హీరోలు మాత్రం వీళ్లే. మాస్ లో భయంకరమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. చిరంజీవి మెగాస్టార్ అయిపోతే.. రవితేజ మాస్ రాజా అయిపోయాడు. ఇప్పటికీ ఈ హీరోలు తమ సినిమాలతో సత్తా చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే 90ల్లోనే ఇండస్ట్రీకి వచ్చాడు రవితేజ. 20ల్లోనే వచ్చి హీరో అవ్వాలనుకున్నాడు. కానీ అక్కడున్న కష్టాలు చూసి మనకు హీరో కాదు.. డైరెక్షన్ కరెక్ట్ అని అటు వెళ్లిపోయాడు. అప్పుడెప్పుడో హిందీలో తీసిన గ్యాంగ్ లీడర్ రీమేక్ ఆజ్ కా గూండారాజ్ లో చిరు ఫ్రెండ్స్ లో ఒకడిగా నటించాడు రవితేజ.

తెలుగులోనూ అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో హీరో స్నేహితుడిగా నటించాడు. ఆ తర్వాత మెల్లగా డైరెక్షన్ నుంచి నటన వైపు వచ్చాడు. అక్కడ్నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. 30 దాటిన హీరో అయ్యి ఇప్పటికీ ఏలేస్తున్నాడు మాస్ రాజా. అలాంటి రవితేజ జర్నీ ఎంతోమంది కొత్త వాళ్ళకు ఆదర్శప్రాయం. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ అంటే సినిమాకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు కానీ ఒకప్పుడు ఈయన తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా..? లక్షల్లో ఉంటుందేమో అనుకోకండి..కేవలం వేలల్లోనే ఉంది. అది కూడా నిన్నే పెళ్లాడతా సమయంలోనే తీసుకున్నాడు రవితేజ. తాజాగా క్రాక్ సినిమా ఇంటర్వ్యూలో తన పాత విషయాలు గుర్తు చేసుకున్నాడు మాస్ రాజా. 

అందులో భాగంగానే చెప్తూ తన తొలి పారితోషికం నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పాడు. ఆయన సంతకం పెట్టిన చెక్ తనకు ఇచ్చారని.. నిన్నే పెళ్లాడతాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినందుకు ఇచ్చారని.. అది కూడా 3500 రూపాయలు అంటూ చెప్పాడు రవితేజ. ఆ చెక్ చాలా రోజుల వరకు దాచేసుకుని ఆ తర్వాత డబ్బులు అవసరం పడి బ్యాంకులో వేసుకున్నానని చెప్పాడు మాస్ రాజా. అలా తనకు తొలి పారితోషికం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తనకు చెక్ ఇచ్చిన నాగార్జున రెమ్యునరేషన్ ను కూడా ఎప్పుడో దాటేసాడు రవితేజ. ఏదేమైనా కూడా గతమెంతో ఘనం.. ప్రస్తుతం అది తీపి జ్ఞాపకం అంతే. ఈయన నటించిన క్రాక్ సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

అన‌సూయకు సూప‌ర్‌స్టార్ తో న‌టించే ఛాన్స్ ..?

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo