శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 20:50:54

‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?

‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?

రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సంక్రాంతికి విడుదలైన క్రాక్ వారం రోజుల్లోనే దాదాపు రూ.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికే మాస్ మహా రాజా సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా క్రాక్ నిలిచిపోయింది. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. ఎందుకంటే ఒకటి రెండు కాదు నాలుగేండ్ల తర్వాత వచ్చిన విజయం కావడంతో దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు మాస్ రాజా.

మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనికి సైతం ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఈయనకు కూడా నాలుగేండ్ల తర్వాత వచ్చిన విజయమే ఇది. దీని కంటే ముందు ఈయన తెరకెక్కించిన విన్నర్ సినిమా 2017లో విడుదలైంది. అది డిజాస్టర్. దానికంటే ముందు వచ్చిన పండగ చేస్కో కూడా యావరేజ్. దాంతో హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు గోపీచంద్ మలినేని.  ఇక క్రాక్ విషయంలో మరోటి కూడా గోపీచంద్‌కు మరుపురాని విషయం. ఈ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడికి మంచి అప్లాజ్ వచ్చింది. ఎవర్రా ఈ కుర్రాడు.. భలే ఉన్నాడు.. పైగా మాస్ రాజాపై నాన్ స్టాప్ పంచులు వేస్తున్నాడంటూ మాట్లాడుకున్నారు. 

కుర్రాడెవరో కానీ దర్శక నిర్మాతలు భలే పట్టుకున్నారు.. ఈ చిచ్చర పిడుగుకు మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నారు. అయితే ఆ తర్వాతే తెలిసింది ఈ కిరాక్ పుట్టించిన కుర్రాడెవరా అని..? ఇంతకీ క్రాక్‌లో రవితేజపై అంతగా సెటైర్లు వేసిన ఆ కుర్రాడెవరో తెలుసా.. దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు సాత్విక్. తన కొడుకునే ఈ సినిమాతో పరిచయం చేసాడు గోపీచంద్. సాధారణంగా కొడుకు పాత్ర అంటే సైలెంట్ గా ఉంటుంది కానీ రవితేజ కొడుకు మాత్రం క్రాక్‌లో మరోలా ఉన్నాడు. సూపర్ సెటైరికల్ గా ఉన్నాడు ఈ చిచ్చుబుడ్డి. క్రాక్ సినిమా చేసిన తర్వాత మాస్టర్ సాత్విక్‌కు మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo