ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 04, 2021 , 21:04:45

యాంక‌ర్స్ రవి, లాస్యను మ‌ళ్లీ క‌లిపింది ఎవరో తెలుసా..?

యాంక‌ర్స్ రవి, లాస్యను మ‌ళ్లీ క‌లిపింది ఎవరో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై అప్పటి వరకు కో యాంకర్స్ లేరు..కేవలం మేల్ యాంకర్స్ లేదంటే ఫీమేల్ యాంకర్స్ మాత్రమే ఉండేవాళ్లు. ఇద్దరూ కలిసి షో హోస్ట్ చేయడం అనేది అప్పటి వరకు జరగలేదు. అలా చేస్తే సక్సెస్ అవుతుందని కూడా ఎవరికీ తెలియదు. కానీ కొన్నేళ్ల క్రితం ఇద్దరు కుర్ర యాంకర్స్ వచ్చి దాన్ని చేసి చూపించారు. వాళ్లే యాంకర్ రవి, లాస్య. ఒకప్పుడు ఈ జోడీకి బుల్లితెరపై ఉన్న క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయారు అభిమానులు. అప్పట్లో మా టీవీలో సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్‌తో వీళ్లు స్టార్స్ అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ కలిసి చేసారు. కానీ తర్వాత కాలంలో ఎందుకో తెలియదు కానీ ఈ జంట విడిపోయారు. ఒకరిపై ఒకరు సెటైర్లు కూడా వేసుకున్నారు.. విమర్శలు చేసుకున్నారు. అంతేకాదు..కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు రవి, లాస్య మధ్య ప్రేమ కూడా ఉందనే వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అటు లాస్య.. ఇటు రవి ఎప్పుడూ స్పందించలేదు. 

రవి, లాస్య విడిపోయిన తర్వాత వేర్వేరుగా చేసారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. శ్రీముఖితో రవి కొంతవరకు సక్సెస్ అయ్యాడు కానీ లాస్య మాత్రం పూర్తిగా బుల్లితెరకు దూరం అయిపోయింది. ఈ మధ్యే బిగ్‌బాస్ 4తో మరోసారి లాస్య అందరికీ పరిచయం అయింది. తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంది. ఈ షోలో దాదాపు 80 రోజులు ఉంది ఈ యాంకర్. ఇదిలా ఉంటే ఇన్నేళ్ళ తర్వాత రవి-లాస్య జోడీ బుల్లితెరపై సందడి చేసారు. వీళ్లిద్దరూ మళ్లీ కలిసి చేసే ప్రోగ్రామ్ ప్రోమోను కూడా రవి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

నిన్ను ఏ విషయంలో అయినా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు అని కూడా రవి తెలిపాడు. ఏదేమైనా ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోవడంతో ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అయితే రవి, లాస్య మళ్లీ కలవడానికి కారణం ఎవరు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ దీనికి కారణం అని తెలుస్తుంది. లాస్యను ఆప్యాయంగా అక్క అని పిలుస్తుంటాడు అభి. అలాగే రవికి కూడా అభిజీత్ మంచి స్నేహితుడు. దాంతో విడిపోయిన ఈ ఇద్దరూ కలిస్తే బాగుంటుందని ఆలోచించి రవి లాస్యను కలిపేసాడు అభిజీత్. అన్నీ కుదిరి రవి, లాస్య కానీ మళ్లీ కలిసిపోయారంటే మాత్రం బుల్లితెరపై ఈ జోడీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి కచ్చితంగా బిజీ అవ్వడం ఖాయం.

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ స్టార్ హీరో ఆరేళ్ల సంపాద‌నెంతో తెలిస్తే షాకే..!

యువ ద‌ర్శ‌కుడికి నాగార్జున డెడ్‌లైన్..!‌

విక్కీకౌశ‌ల్ ఫొటో డిలీట్ చేసిన క‌త్రినా..నెటిజ‌న్ల కామెంట్లు

ప‌వ‌న్ తో ఐశ్వ‌ర్య‌రాజేశ్ ప్రేమ‌లో ప‌డ‌నుందా..?

అటు కేర‌ళ అందాలు..ఇటు సోనాక్షి వ‌య్యారాలు

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo