అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సినిమా పుష్ప. తెలుగుతో పాటు ఒకేసారి అన్ని భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కుతుంది. తొలిసారి పాన్ ఇండియన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి బయల్దేరారు బన్నీ, సుకుమార్. అల్లు అర్జున్ కు ఇప్పటికే నార్త్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. మరోవైపు సుకుమార్ కూడా క్రియేటివిటీతోనే సినిమాలు చేస్తుంటాడు. ఈ ఇద్దరూ కలిస్తే వచ్చే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్స్ కు బాగా తెలుసు. ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఈ రుచి చూపించాలని ఫిక్సయ్యారు బన్నీ, సుకుమార్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటీనటులు కూడా అంతే భారీగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు సుకుమార్.
ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని ముందు నుంచి కూడా అనుకున్నారు. అయితే కుదర్లేదు..ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో తప్పుకున్నాడు. ఆ తర్వాత బాబీ సింహా పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఆ తర్వాత చివరికి మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను ఫైనలైజ్ చేసారు. ఈయన కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత కరోనా ఉందని కేరళ వెళ్లిపోయాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు ఫహాద్. మరోవైపు ఈ చిత్రంలో ఫహాద్ తో పాటు మరో విలన్ కూడా ఉన్నాడు. ఆయన ఎవరో తెలిస్తే నిజంగానే అంతా షాక్ అవుతారు. ఎందుకంటే సుకుమార్ అలాంటి విలన్ ను పుష్ప కోసం పట్టుకొస్తున్నాడు.
ఆయనెవరో కాదు.. సునీల్. ఇన్నేళ్ళు కామెడీతోనే కడుపులు చెక్కలు చేసిన సునీల్.. ఇప్పుడు ప్రతినాయకుడిగా మారిపోతున్నాడు. రవితేజ డిస్కో రాజాతో పాటు కలర్ ఫోటో సినిమాలోనూ తన విలనిజం చూపించాడు సునీల్. ఇప్పుడు పుష్పలో కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. అత్యంత కీలకమైన పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. నిజానికి ఇండస్ట్రీకి విలన్ కావాలనే వచ్చిన సునీల్ ను పరిస్థితులు కమెడియన్ ను చేసాయి. ఇన్నేళ్ళకు తనలోని అసలైన విలన్ ను బయటికి తీసుకొస్తున్నాడు ఈ హీరో కమ్ కమెడియన్. సెకండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ బ్రేక్ కోసం చూస్తున్న సునీల్ కు పుష్ప కావాల్సింది ఇస్తాడేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Recommended Content by ntnews.com