మంగళవారం 07 జూలై 2020
Cinema - Jun 04, 2020 , 16:02:15

భూమికకు ఎన్నిపేర్లో తెలుసా?

 భూమికకు ఎన్నిపేర్లో తెలుసా?

ముంబయి నుంచి తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. ఈమె మొదటి సినిమా 'యువకుడు'. తరువాత తమిళ్‌, హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. భిమిక చావ్లా అనే పేరు మనందరికీ తెలిసిందే.. మనకు తెలియని పేర్లు చాలానే ఉన్నాయి. జనరల్‌గా సెలెబ్రిటీలకు సినిమాల్లో ఒకపేరు, ఇంట్లో ఒకపేరు ఉంటాయి.

కానీ భూమికకు ఇంట్లో ఒకపేరు, స్కూల్లో ఒకపేరు, ఫ్రెండ్స్‌ పిలిచేదానికి ఒక పేరు ఉన్నాయట. భూమికను ఇంట్లో ‘గుడియా’ అని పిలుస్తారట. స్కూలు, కాలేజీ ఫ్రెండ్స్ 'భుపేందర్‌’,అంటారట. మరికొంత మంది తెలిసినవారు ‘రచన’ అని పిలుస్తారట.  భూమికకు మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా తేరేనామ్‌(2003). ఇందులో సల్మాన్‌ఖాన్‌ హీరో. 2007లో భరత్‌ టాకూర్‌ ను భూమిక పెళ్లి చేసుకుంది.


logo