మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 21:27:03

నితిన్ గిఫ్ట్ రేంజ్ రోవర్‌కు ఓ కథ వుంది !

నితిన్ గిఫ్ట్ రేంజ్ రోవర్‌కు ఓ కథ వుంది !

తన కెరీర్‌కు భీష్మ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాని ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుమలకు నితిన్ ఇటీవల ఆయన జన్మదిన కానుకగా రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి హాట్‌టాపిక్ అయ్యాడు. అది చూసిన అందరూ నితిన్ గ్రేట్.. హిట్ సినిమా ఇస్తే ఓ హీరో కోటి రూపాయల విలువైన కారును ఇవ్వడం నిజంగా అభినందనీయం అంటూ అందరూ తెగ మెచ్చుకున్నారు. అయితే ఈ రేంజ్‌రోవర్ కారుకు ఓ కథ వుంది. భీష్మతో వెంకీ వర్కింగ్ స్టయిల్ నచ్చిన నితిన్ అతనితో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఆ సినిమా కూడా తన సొంత బ్యానర్‌లో చేయాలని అనుకున్నాడట.

అయితే వెంకీకి వున్న తదుపరి కమిట్‌మెంట్స్ వల్ల నితిన్‌కు ఏ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు వెంకీ. దీంతో ఆయన పుట్టినరోజుకు నితిన్ రేంజ్ రోవర్ కారును అడ్వాన్స్ గిఫ్ట్‌గా ఇచ్చి వెంకీని బుక్ చేశాడు. దీంతో వెంకీ ఆ కారునే అడ్వాన్స్ తీసుకొని కమిట్ అయ్యాడట.. ఇదండి రేంజ్‌రోవర్ కమిట్‌మెంట్ కథ..logo